Home » YS Viveka
వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారని సంచలన విషయాన్ని వెల్లడించాడు.
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 19కి వాయిదా పడింది. సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ ముగిసింది.