Home » YS Sharmila
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రజలు ఏం పాపం చేశారు.. మీకు ఓట్లు వేసి గెలిపించడమే పాపమా’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారని... 35వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు ఏడ్చినంత పని చేశారన్నారు.
విద్యుత్ ఛార్జీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటినుంచి ఆందోళన చేపడుతామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
Andhrapradesh: మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్... విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వంలో బాగా చేసి చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా తాము పని చేయడం లేదని చెప్పారు. ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం ..ఈ కూటమి ప్రభుత్వం ప్రజలది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర చేశామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభివర్ణించారు.