Home » YS Sharmila
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
‘అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది.
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.
ఈపీఎస్ 95 ఫించన్లదార్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చి రెండేళ్లు అయినా కేంద్రం చర్యలు చేపట్టక పోవడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాశారు.