Home » Yogi Adityanath
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 6న కబేళాలు మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ కార్పొరేష్ చట్టం, ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
Mk Stalin Fires Back on Yogi: తమిళనాడు సీఎం, డీఎంకే నాయకుడు స్టాలిన్ ఉత్తరప్రదేశ్ యోగి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించదని, బలవంతంగా ప్రజలపై త్రిభాషా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న మీ దురహంకార వైఖరినే మా పోరాటమని స్పష్టం చేశారు.
ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు విమానంలో బయలుదేరిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించడంతో పెలట్లు వెనక్కి మళ్లించారు.
కుంభమేళా విజయవంతం కావడానికి సమిష్టి కృషి కారణమని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన కర్మయోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ అభివృద్ధిని అడ్డుకోలేదని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
Yogi Adityanath Nepal: పొరుగు దేశం నేపాల్‌లో ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల సీఎంలు ఉండగా కేవలం యోగి పేరే ట్రెండింగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..
లక్నోలో బుధవారంనాడు మీడియాతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని చూసి తాము గర్విస్తున్నామన్నారు. యావత్ ప్రపంచ ఒకనాటికి సనాతన ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కాశీలో మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరూక ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇచ్చిందని, అన్ని రికార్డులను మహాకుంభ్ తిరగరాసిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
MahaKumbh Mela 2025 Boatman : మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అసెంబ్లీ సాక్షిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాను కనివినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించామని చెప్తూ.. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పడవ నడపి రూ.30 కోట్లు సంపాదించిన స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కంటే ఔరంగజేబే సమాజ్‌వాది పార్టీకి ఆరాధ్యదైవం అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని సమాజ్‌వాదీ పార్టీని ఆయన నిలదీశారు.