Home » yoga meditation
అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో శనివారం ఘనంగా జరిగింది. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన యోగా డే కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యోగాంధ్రలో పాల్గొనేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా చేరుకున్నారు. కంపార్టుమెంట్లలోకి చేరుకున్న వారికి మ్యాట్, టీ షర్ట్, స్నాక్స్, వాటర్ బాటిల్ అందించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు.
యోగాంధ్రలో 10.87 లక్షల మంది అనంతపురం జిల్లావాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శనివారం విశాఖలో నిర్వహించిన యోగా వేడుకలను జిల్లాలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు
రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరిగింది. పెద్దల నుంచి పిన్నల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘యోగాంధ్ర’కు వన్నెతెచ్చారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది. అందుకే ఈరోజు 175కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ యోగా దినోత్సవం మానవాళికి యోగా 2.0 ప్రారంభాన్ని సూచిస్తుందని తెలిపారు.
యోగాంధ్రను విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒక్క విశాఖలోనే కాక ఏపీవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి పైగా ప్రజలు యోగాసానాల్లో పాల్గొని చరిత్ర సృష్టించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల్లోని 1300 నగరాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగరతీర నగరం ముస్తాబైంది. శనివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ సుమారు 30 కి.మీ. పొడవునా యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.