Home » YCP
మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని..
అదానీ స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్ షాక్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.
రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ జగన్ చానల్‌లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు కస్టడీలో రెండోరోజు శనివారం కూడా నోరు మెదపలేదని తెలిసింది. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని....
ప్రతిపక్షంలో ఉండగా అదానీ, షిర్డీసాయి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు వద్దని చెప్పిన కూటమి.. ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు నుంచి వ్యవసాయ విద్యు త్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చినా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బిగిస్తున్నారు.
రాజధాని అమరావతిపై జగన్ అండ్ బ్యాచ్ మరోసారి విషం చిమ్మింది. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత చానల్‌లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్ డిబేట్‌లో నోరుపారేసుకున్నారు.
జగన్ పాలనలో జరిగిన మూడున్నర వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయపడుతున్నాయి. కమీషన్ల సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు కొంత ఖర్చు చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలిన సంగతి తెలిసిందే.
‘మంచి ప్రభుత్వం’ అంటే ఏమిటి? లెక్కా పక్కా లేకుండా ప్రజాధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేసేయడమేనా? కోట్లు పంచిపెట్టి మరీ... తిట్టించుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరమా? రేషన్ సరుకుల పంపిణీ వాహనాల (ఎండీయూ) విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలివి!
‘నాకు తెలియదు... నాకు సంబంధం లేదు... మా లాయర్‌ను అడగండి..!’ తొలిరోజు పోలీసుల విచారణలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పిన సమాధానాలు ఇవీ.
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి.. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారమైపోయాయి.