Home » Yadadri Temple
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు.
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈరోజు (మే 15న) ప్రపంచ సుందరీ మణులు సందర్శించారు. 9 దేశాలకు చెందిన 30 మంది పోటీ దారులు, సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకుని, దర్శించుకున్నారు.
వేసవి సెలవులు, పరీక్షా ఫలితాల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 46 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనం కోసం విచ్చేసి, ప్రత్యేక ధర్మదర్శనాలకు ఎక్కువ సమయం ఎదురుచూశారు
సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.