Home » Weather
అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 1050.47 హెక్టార్లలో రూ.10.29 కోట్ల పంట నష్టం జరిగింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. నేటి నుంచి కోస్తా జిల్లాల్లో మళ్లీ వడగండ్లు తాకే అవకాశం ఉంది
ఇసుకు తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకుని చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్దిగంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు చేరాయి
భారత వాతావరణ శాఖ ముందుగానే ఢిల్లీలోని గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం ఉంటుంది. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలు కురవగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది
తీవ్ర అల్పపీడనం బలహీనపడింది, మరింత దిశ మార్చుకుంటూ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరిగి, వాయవ్య గాలులతో వర్షాలు కురిపిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు, వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
తెలంగాణలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఎండలు పెరగనున్నాయి