Home » Vote
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024 ) కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఏడు విడతల్లో జరగనున్న ఎలక్షన్లకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
2006 మార్చి 31వ తేదీ లోపు జన్మించిన వారికి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం కోరుతుంది.
విజయవాడ: ప్రజాస్వామ్యంలోప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సేవ పేరుతో ప్రజలకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ సమరం వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో మీ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. మరి, మీ పేరు ఉందో, లేదో ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా? ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే మీ పేరు ఉందో, లేదో సులభంగా తెలిసిపోతుంది.
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 16న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయి. ఓటర్ల సౌకర్యార్థం ఈసీ ఓటర్ హెల్ప్ యాప్‌ని ప్రారంభించింది. ఇది అనేక ఇతర విషయాలతోపాటు ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి కింది స్టెప్స్ అనుసరించండి.
సాధారణంగా మన దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే విద్యార్థులకు ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
రానున్న కొన్ని రోజుల్లో దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకు ముందు నుంచే ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు సిద్దం అంటూ సభలు పెడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. గత రెండు రోజుల నుంచి ఓటర్లకు చీరల పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేపట్టింది.
YSRCP-Voters: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నేతలు, మద్దతుదారుల అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయి. కార్యకర్తల నుంచి పెద్దల వరకూ డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు నమోదు చేసిన ఘటనలు బయటపడ్డాయి.
శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నోటి దురుసును ప్రదర్శించారు. తనకు ఓటు వేయించాలని పిల్లలను కోరారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో పిల్లల గురించి మాట్లాడొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.