Home » Vizag News
విశాఖలో గల శారదా పీఠం వెళ్లే మార్గం సరిగా లేదు. అక్కడ తారు రోడ్డు వేయించాలని అనుకున్నారు. పీఠాధిపతిపై భక్తిని చాటుకునేందుకు కేవలం రెండు రోజుల్లో నిర్మించారు. పీఠం తారు రోడ్డు కోసం ఏకంగా రూ.96 లక్షలు ఖర్చు చేశారు. 480 మీటర్ల మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు.
కప్పరాడలో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంపై శారదా పీఠం కన్ను పడింది. ఆలయ నిర్మాణం, భక్తుల నుంచి స్పందన రావడం, వీఐపీ భక్తులు రావడంతో అధిక ఆదాయం సమకూరుతుంది. ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకుంటోంది.
రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిధి కోసం రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సోమవారం పవన్ సమావేశం అయ్యారు.
సీఎం జగన్ దళిత ద్రోహి అని.. ఆయనకు, వైసీపీ నేతలకు దళితుల మీద ప్రేమ కపట నాటకమని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఒక కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని విరుచుకుపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ( ఈ రోజు) విశాఖపట్టణం వెళతారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వస్తారు. మూడు రోజులపాటు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు విశాఖ పెందుర్తి నియోజకవర్గం, పురుషోత్తపురంలో, శంఖారావం సభ నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో మళ్లీ భీమిలి నుంచే పోటీ చేస్తానని.. ఆ నియోజకవర్గంలో తాను గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) తెలిపారు. గతంలో రెండు సార్లు కూడా భీమిలి నుంచే పోటీ చేశానని గుర్తుచేశారు. భీమిలీలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.
వైసీపీ నేతల తీరుపై సీఎం జగన్ (CM Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు కార్యక్రమానికి జనం తక్కువగా రావడంపై మండిపడ్డారు.