Home » Vizag News
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) జైల్లో ఉంటే.. ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాపమని పాదయాత్ర చేస్తే తరిమేశాడని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ..జగన్ లాగా ఊరుకో ప్యాలస్ లేదన్నారు.
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని, 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీ భరత్(Sri Bharat) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ఎస్సీ, బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీఎం జగన్ రెడ్డి(CM Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) X(ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు జగన్, ఆయన అనుచరులు వచ్చాక ఆగడాలు మీతిమీరిపోయాయని అన్నారు. విశాఖలో ప్రజలకు రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆయనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.
ఏపీ సచివాలయం తాకట్టుపై X(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని... ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Visakhapatnam News: చూసేందుకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకేముంది.. సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా(Social Media Influencer) మంచి గుర్తింపు పొందింది. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఏం సంపాదిస్తాం లే అనుకుందో.. లేక వచ్చే డబ్బులు సరిపోలేదో తెలియదు గానీ..
Visakha Patnam News: విశాఖపట్నం (Visakhapatnam) సాగర్ నగర్ బీచ్(Sagar Nagar Beach) పరిసరాల్లో వింత జీవి కళేబరం కలకలం సృష్టించింది. పాము ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చం పామును(Snake) పోలిన ఈ జీవి చనిపోయి ఉంది. సాగర్ నగర్ బీచ్ సమీపంలోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంత పరిసరాల్లో భారీ పాము కళేబరం కనిపించింది.
తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
విశాఖపట్టణం సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది. భీమిలి మండలం కొత్త వలసలో కూడా భూమికి మంచి ధర ఉంది. ఆ ప్రాంతంలో 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పనంగా కట్టబెట్టారు.