• Home » Vizag News

Vizag News

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

AP Elections: జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో ఓట్ల కౌంటింగ్‌(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.

Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే..?

Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే..?

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.

Miss Vizag Nakshatra: తేజ చాలా మంది అమ్మాయిలను వాడుకొని వదిలేశాడు

Miss Vizag Nakshatra: తేజ చాలా మంది అమ్మాయిలను వాడుకొని వదిలేశాడు

భర్త తేజపై మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చానని తెలిపారు.

AP News: కారుచౌకగా భోగాపురం భూములు

AP News: కారుచౌకగా భోగాపురం భూములు

విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్‌ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ భూముల మార్కెట్‌ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.

AP Politics: సీఎస్ జవహర్ రెడ్డి‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత

AP Politics: సీఎస్ జవహర్ రెడ్డి‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్ నోటీస్ జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) కార్యాలయం హెచ్చరించింది.

Rain Alert: దూసుకొస్తున్న రెమాల్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert: దూసుకొస్తున్న రెమాల్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 6 గంటల్లో రెమాల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Elections2024: ఆ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారు.. జనసేన నేత సంచలన ఆరోపణలు

AP Elections2024: ఆ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారు.. జనసేన నేత సంచలన ఆరోపణలు

ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని జనసేన (Jana Sena) సీనియర్ నేత పీతల మూర్తి యాదవ్ (Murthy Yadav) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు.

AP News: విద్యార్థినులపై లైంగిక వేధింపులు..  దిశ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

AP News: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. దిశ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎన్ని చట్టాలు వస్తున్న మాత్రం ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... భీమిలి మండలం సంగివలన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రేడియాలజీ ప్రొఫెసర్ టి. నాగేశ్వరరావు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దిశ పొలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి