Home » Vijayasai Reddy
Andhrapradesh: కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌కు సంబంధించిన షేర్లు బలవంతంగా లాక్కున్నారని గతంలో కేవీ రావు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విక్రాంత్ రెడ్డితో పాటు శరత్‌చంద్రా రెడ్డి, విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగానే సీఐడీ అధికారులు విజయసాయికి నోటీసులు ఇచ్చారు.
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్‌ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
Andhrapradesh: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వానికి ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో శాంతి భర్త మదన్ మోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు.
Andhrapradesh: 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.
వైఎస్పార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఎందరో అధికారులు, విశాఖవాసులను భయపెట్టి, బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. విజయసాయిరెడ్డిపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యతల నుంచి..