• Home » Varla Ramaiah

Varla Ramaiah

Varla Ramaiah: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

Varla Ramaiah: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

సీఎం జగన్, వైసీపీ నేత పేర్ని నాని, కర్నూలు ఎస్పీపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని స్కూల్ పిల్లలతో జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

అమరావతి: ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్ దారులను సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని అన్నారు.

TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ

TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ

Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.

AP Politics:  సీఎం కార్యాలయానికి వచ్చింది పాంట్రీ కారో, ఫైనాన్స్ కారో..?: వర్ల రామయ్య

AP Politics: సీఎం కార్యాలయానికి వచ్చింది పాంట్రీ కారో, ఫైనాన్స్ కారో..?: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఇంటికి వచ్చిన కంటైనర్ వ్యవహారం తేల్చాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు.

TDP: బాబుతో రామ రాజ్యం.. జగన్‌తో రావణ రాజ్యం: వర్ల రామయ్య

TDP: బాబుతో రామ రాజ్యం.. జగన్‌తో రావణ రాజ్యం: వర్ల రామయ్య

టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu) రాష్ట్రంలో రామ రాజ్యం వస్తుందని.. జగన్ పాలన రావణ రాజ్యానికి ప్రతీక అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆక్షేపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన అప్రజాస్వామికం అని.. రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

అమరావతి: టీడీపీ నాయకుల ఫోన్ల టాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు.

2024 Elections: పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోంది.. వైసీపి కోసం దొంగ ఓట్లు కూడా..

2024 Elections: పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోంది.. వైసీపి కోసం దొంగ ఓట్లు కూడా..

అధికార వైసీపీ (YCP) అరాచకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తుండటంపై.. పోలీస్ శాఖ (Police Department) మీద టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ (Election Code) వచ్చిన తర్వాత కూడా పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

AP Politics: సీఈఓ మీనాను కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు.. కారణమిదే..?

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్‌ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు.

Varla Ramaiah: చర్చి ఫాదర్లనే మభ్యపెట్టడం దారుణం..

Varla Ramaiah: చర్చి ఫాదర్లనే మభ్యపెట్టడం దారుణం..

ఏపీలో వైఎస్ జగన్ కోసం చర్చి ఫాదర్లనే మభ్యపెట్టాలని చూడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగసంఘాల నేత వెంకట రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా..

TDP: ఏపీ డీజీపీకి వర్లరామయ్య లేఖ.. ఏమన్నారంటే..?

TDP: ఏపీ డీజీపీకి వర్లరామయ్య లేఖ.. ఏమన్నారంటే..?

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) సోమవారం నాడు లేఖ రాశారు. నారా లోకేష్ (Nara Lokesh) కళ్యాణదుర్గం, రాయదుర్గం శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి