• Home » Varla Ramaiah

Varla Ramaiah

 AP Elections 202; వచ్చే నెలలో  కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

AP Elections 202; వచ్చే నెలలో కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.

AP Elections 2024: అవినాష్ రెడ్డి అమాయకుడంటే కడప ప్రజలను వంచించడమే:వర్లరామయ్య

AP Elections 2024: అవినాష్ రెడ్డి అమాయకుడంటే కడప ప్రజలను వంచించడమే:వర్లరామయ్య

గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్‌రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.

AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి

AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.

AP Elections: పోలీసులను వైసీపీ సర్కార్ వాడుకుంటోంది.. ఈసీకి వర్లరామయ్య లేఖ

AP Elections: పోలీసులను వైసీపీ సర్కార్ వాడుకుంటోంది.. ఈసీకి వర్లరామయ్య లేఖ

Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.

varla ramaiah: వైసీపీ పాటలకు ఆ సీఐ స్టెపులు వేస్తారు

varla ramaiah: వైసీపీ పాటలకు ఆ సీఐ స్టెపులు వేస్తారు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ

Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్‌ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని..

 AP Election 2024: ఆ వార్తలు సాక్షిలో ఎలా వచ్చాయి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

AP Election 2024: ఆ వార్తలు సాక్షిలో ఎలా వచ్చాయి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

 AP Election 2024: పేరెంట్స్‌ మీటింగ్ ఎలా పెడతారు.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

AP Election 2024: పేరెంట్స్‌ మీటింగ్ ఎలా పెడతారు.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

ఎన్నికల సంఘం పలుమార్లు చెప్పినా కొంతమంది ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) అన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు.

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు.

 Varlaramaiah: అందుకే రాయి దాడి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య విసుర్లు

Varlaramaiah: అందుకే రాయి దాడి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య విసుర్లు

జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ (CM Jagan) తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్‌ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుస్తోందని... అందుకే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి