Home » Vantalu
భావప్రకాశ అనే వైద్యగ్రంథంలో ‘వేఢమికా’ అనే వంటకం గురించి ఉంది. మినప్పిండిని గారెల పిండిలాగా గట్టిగా ముద్ద అయ్యేలా రుబ్బి గోధుమ పిండితో వత్తిన పూరీ మధ్య పూర్ణంలా వుంచి, మూసి బొబ్బట్టు వత్తినట్టు గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చినదివేఢమిక.
తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్ ఫింగర్ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్ మాన్స్ టో’ అంటారు.
గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో మీకు తెలుసా.., అలాగే ఆ వంటకంలో ఏమేమి వాడతారో కూడా తెలుసా.. అసలు ఇది ఎలా తయారు చేయాలో, ఆ వంటకంలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం పందండి. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి మరి..
వంగపువ్వు పూయగానే శుభదినం అని దీపారాధన చేస్తారు. ‘క్షేమకుతూహలంలో’ క్షేమశర్మ శాకజాతులన్నింటిలో వంకాయను శాక నాయకం అనీ, కూరగాయల్ని చెప్పేటప్పుడు వంకాయతో మొదలు పెట్టాలనీ అన్నాడు.
పాకశాస్త్ర గ్రంథాల్లో వంటకాలకు తాలితం, భృష్టకం, స్విన్నం, శుష్కం, బహురసం, తందూరు, వంటితం, శూల్యం, పుటపాకం ఇలా అనేక పద్ధతులున్నాయి. ఇప్పుడు వాటి పేర్లను ఒకసారి గుర్తుచేసుకుందాం.
మనలో జిలేజీ అంటే ఇష్టం లేని వారుండరు. అయితే... దీనికి మరోపేరు ఉందని చాలామందికి తెలియదు. దీనికి శతాబ్దాల క్రితమే మరో పేరుతో పిలిచేవారు. అసలు దాని పేరు ఏంటో.. ఆ పేరు పోయి జిలేజీగా ఎలా మారిపోయిందో.. ఇట్లాంటి వివరాలన్నీ ఈ కథనంలో తెలుపుకుందాం పదండి మరి...
లోకోపకార గ్రంథంలో రోజువారీ ఆహార ధాన్యంగా బార్లీని వాడుకునే కొన్ని ఉపాయా లను వివరించాడు. బార్లీ ఇంగ్లీషు పదం. మన వాళ్లు యవధాన్యం అనేవారు. బార్లీ, ఓట్స్ ఒకే కుటుంబానికి చెందినవి. సమాన గుణధర్మాలు కలిగినా మనవి కాబట్టి, బార్లీ మనకి ఎక్కువ హితవుగా ఉంటుంది.
Tomato Rasam: ఈ విధంగా టమాట రసం తయారు చేసుకొంటే.. దాదాపు వారం రోజుల వరకు అవి పాడవవు. ఫ్రిజ్‌లో పెట్టకున్నా.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు వేడి చేసుకొని ఈ చారును అన్నంలో కలుపు కోవచ్చు.
Tasty Godhumapala Halwa: హల్వాల్లో ఎన్నో రకాలున్నాయి. ఒక్కో హల్వా ఒక్కో రుచితో స్వీట్ లవర్స్ ను ఊరిస్తూ ఉంటాయి. కానీ, వీటిలో స్వచ్ఛమైన గోధుమ పాలతో తయారుచేసిన హల్వాకి కూడా స్థానం ఉందండోయ్.. దీన్నొక సారి రుచి చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు..
Brinjal Soup: వంకాయ సూప్ తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇవి తాగడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతోంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ సూప్‌ను ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు.