Home » VANGALAPUDI ANITHA
గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై హోం మంత్రి వంగల పూడి అనితకు (Vangalapudi Anitha) బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోంమంత్రి కాన్వాయ్‌కి అడ్డంగా వచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.
వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్‌కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.