Home » VANGALAPUDI ANITHA
Anitha: అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదని.. ఆ వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు.
Nara Lokesh: విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమదైన శైలిలో ఇలా స్పందించారు.
Homeminister Anitha: వైసీపీ నేత వంశీ అరెస్ట్ విషయంలో జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పారని.. వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని అనిత ప్రశ్నించారు.
Vangalapudi Anitha: వైఎస్సార్సీపీపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి చెందిన మహిళా నేతలు తాము మహిళలు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vangalapudi Anitha: పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్‌షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని.. ట్రాఫిక్, పార్కింగ్‌పై దృష్టి సారించాలన్నారు.
Atchannaidu: ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు (బుధవారం) రానున్నారు. విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాటు చేసింది.
విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.
వైసీపీ సోషల్ మీడియాలో మహిళలను కించ పరుస్తూ.. పోస్టింగ్‌లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలోనే కాదు.. హోం మినిస్టర్నైన తనపై నేటికి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల తన పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నాడంటూ వర్రా రవీందర్ రెడ్డిపై హోం మంత్రి అనిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.