Home » Vande Bharat Express
రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది.
రాష్ట్రానికి రెండో వందేభారత్ రైలు(Vande Bharat train) వచ్చింది. దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేం
ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని బూచిగా చూపుతూ ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళవారంనాడు ప్రారంభించారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.
వర్షాల హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని సహడోల్ లో ప్రధాని పర్యటించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం రద్దయింది. అయితే భోపాల్ పర్యటన మాత్రం మంగళవారం యథాప్రకారం జరుగుతుంది.
తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ రైలు సర్వీసు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈ ప్రీమియం రైలు గంటా 10 నిమిషాల ఆలస్యంగా గుంటూరు చేరుకొన్నది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలో 14 నిమిషాల ఆలస్యంగా 3.29కి బయలుదేరిన ఈ రైలు నెల్లూరుకు 24 నిమిషాలు, ఒంగోలుకు గంటా 4 నిమిషాల ఆలస్యంగా వచ్చింది.
వందే భారత్ రైలుకు ఇకపై 8 బోగీలు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు. పెరంబూర్ ఐసిఎఫ్‌లో తొలిసారిగి స్వదేశీ సాంకేతిక
ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది....
పూరి- హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ తగిలింది. పూరి-హౌరా వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది....
ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.