Home » Uttam Kumar Reddy Nalamada
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)లుగా 12-13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిని తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)లుగా పదోన్నతి కల్పించాలని 2004 బ్యాచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీర్లు ప్రభుత్వాన్ని కోరారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ నెల 14న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రాజెక్టుల నిర్వహణను తుంగలో తొక్కింది.
ప్రతిపక్షాలు సాగు, నీటి ప్రాజెక్ట్‌లపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు వివాదానికి బీఆర్‌ఎస్సే కారణమని భారీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ భద్రతపై నిర్లక్ష్యాన్ని చూపినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ లీగల్ నోటీసులు పంపింది.
ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన (జీబీ లింక్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అడుకొంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్‌బీసీ పనులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులని కేటాయించామని అన్నారు. టన్నేల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ - 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.