Home » Uttam Kumar Reddy Nalamada- Congress
రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ రావు లేఖరాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్‌లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్పా మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీస్కొని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. గురువారం నాడు సచివాలయంలో సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు ప్రాజెక్టులపై పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.