Home » Ustaad Bhagat Singh
ఏపీలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలైన తొలి 10 రోజులపాటు ప్రత్యేక ధరలను అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
జనసేన (Janasena) అధిపతి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా నుంచి రీసెంట్‌గా భగత్స్ బ్లేజ్ పేరిట ఒక టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సంగతిని పక్కన పెడితే.. ఇందులో పవన్ గాజు గ్లాసుపై చెప్పిన డైలాగ్ మాత్రం పెను దుమారం రేపింది. ఇది పొలిటికల్ ప్రచారం తరహాలో ఉందంటూ కొన్ని వర్గాలవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.