Home » Uravakonda
అవ్వ, తాతలకు పెద్ద కొడుకుగా, వితంతువులకు అన్నగా నిలుస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ. వేల కోట్లను పింఛన రూపంలో అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు.
వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఆర్టీసీలో ప్రవేశపెడు తున్న ఎలకి్ట్రకల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించరాదని ఆ ర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో వద్ద బుధవారం రెండో రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు.
వజ్రకరూరు పోలీస్ స్టేషనలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కేసులు పరిష్క రించలేక సతమవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. పోస్టింగ్ ఈ స్టేషనలో ఉన్న సిబ్బంది అటాచ పేరుతో వేరే స్టేషనకు వెళ్లారు. అలగే ఈ స్టేషనకు రావాలం టేనే సిబ్బంది హడలెత్తుతున్నట్లు స మాచారం. ఏఎస్‌ఐలు నలుగురు ఉండగా ప్రస్తుతం స్టేషనలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అ న్ని రంగాల్లోకి విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం పేర్కొన్నారు. స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్మాణం పూ ర్తయిన ఉమెన్స హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు.