• Home » TSRTC

TSRTC

TGRTC: వారంలోగా బకాయిలు కట్టకపోతే స్వాధీనం.. జీవన్ రెడ్డి మల్టీపెక్స్ వివాదంపై ఆర్టీసీ

TGRTC: వారంలోగా బకాయిలు కట్టకపోతే స్వాధీనం.. జీవన్ రెడ్డి మల్టీపెక్స్ వివాదంపై ఆర్టీసీ

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్‌స్టాండ్ సమీపంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. టీజీఎస్ఆర్టీసీకి(TGRTC) పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కోర్టు ఆదేశించింది.

Hyderabad: అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి..

Hyderabad: అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి..

గ్రేటర్‌లో ఆర్టీసీ బస్‌ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్(MGBS, JBS)‏లకు రాత్రి 12 గంటల తర్వాత పదుల సంఖ్యలో బస్సుల రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాల నుంచి బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు నగరంలోని ఇళ్లకు చేరేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో..  నిందితులపై కేసు నమోదు

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో.. నిందితులపై కేసు నమోదు

తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌ లోగోను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్

టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌..

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

గురువారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

త రెండు రోజుల్లో టీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్‌ చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..

Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌కు ఇప్పటి వరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

Voters: ఓటేసి వద్దామని!

Voters: ఓటేసి వద్దామని!

భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.

Elections 2024: ఓటు వేసేందుకు సొంతూర్లకు ప్రజలు.. బస్టాండుల్లో రద్దీ అధికం

Elections 2024: ఓటు వేసేందుకు సొంతూర్లకు ప్రజలు.. బస్టాండుల్లో రద్దీ అధికం

Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి