Home » Trains
ఓ రైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓవ్యక్తి కిటికీ వద్ద నిలబడి బయట ప్రదేశాలను వీడియో తీస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కెమెరాను లోపలికి పాన్ చేయగానే షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది రైలా లేక లాడ్జీనా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు..
చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల మహిళా బోగీల్లో పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సంఘటనతో అధికారులు లీస్ పహారాను ఏర్పాటు చేశారు.
అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీన బెంగళూరు-కలబురగి మధ్య (వయా గుంతకల్లు) అప్ అండ్ డౌన్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలని అధికారులు కోరారు.
ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలు పట్టాల మధ్యలో నిలబడి వీడియోలు చేస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కనే ఉన్న రంధ్రంలో ఇరుక్కుపోవడంతో అక్కడున్న వాారంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మనవాళ్లు ఎప్పుడూ అంతే.. చేతులు కాలాక ఆకులు పట్టున్నట్లు.. సామెత మాదిరిగా.. సంఘటన జరగక ముందు జాగ్రత్త పడకుండా ఘటన జరిగాక మేల్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షించదగ్గదే అయినా.. ఈ పనేదో ముందుగానే చేస్తే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రైలు ప్రయాణాల్లో సీటు దొరకాలంటే నెలల ముందుగానే రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు దొరకడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా. అయితే బుక్ చేసేటప్పుడు తక్కువ రద్దీగా ఉన్న రైళ్లను ఎంచుకోవడం మంచిది.
చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
రైలులో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలు ఉంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మరొకరు స్వ్కాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టేన్స్ రైళ్లలో అయితే టీటీఈలు ఆరు లేదా ఎనిమిది గంటలకు ఒకరు మారుతుంటారు. స్వ్కాడ్ ఏ స్టేషన్‌లో ఎక్కుతారో.. ఎక్కడ దిగుతారో తెలియదు.