Home » Trains
లంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్‌లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది.
సికింద్రాబాద్ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్‌కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కోవై జిల్లా ఆవారంపాళ్యంలో రైలును కూల్చివేయాలనే సంఘ విద్రోహులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే త్రివేడ్రం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోవై జిల్లాలోని ఆవారంపాళ్యం దాటిన సమయంలో పట్టాలపై సిమెంటు రాళ్లు పెట్టిన విషయం తెలిసింది.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.
జార్ఖండ్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని పాట్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్మాటియా-ఫరక్కా ఎంజీఆర్ రైల్వే లైన్‌లో గూడ్స్ రైలు వెళ్తుండగా 13, 14 ఏళ్ల లోపు ఉన్న దొంగలంతా అందులోకి ఎక్కేశారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్‌ఫ(ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో డెమో, మెమూ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది.
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.