Home » Train Accident
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో ఈరోజు ఉదయం భారీ రైలు ప్రమాదం(train accident) సంభవించింది. గూడ్స్ రైలు ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
పశ్చిమ బెంగాల్లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్‌లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి...
మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshmareddy) మిర్యాలగూడలో మానవత్వం చాటుకున్నారు. విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ప్రమాదంతో..మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని మానవత్వంతో ఎమ్మెల్యే స్పందించారు.
జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.