Home » Traffic Police
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మన దేశంలో వాహనాల హార్న్ విషయంలో ఎలాంటి రూల్స్ లేవు. వాహనం ఒక్క నిమిషం ఆగితే చాలు హారన్ మోగించి విసిగిస్తుంటారు. అందులోనూ మన బస్సులు, లారీల హార్న్‌ల మోత ఓ రేంజ్‌లో శబ్ద కాలుష్యం కలిగిస్తుంది. మనదేశం గురించి విదేశీ పర్యాటకులు చేసే ఫిర్యాదుల్లో ఈ హార్న్ అంశం కూడా తప్పనిసరిగా ఉంటుంది.
రూల్స్ తప్పితే ఇలానే ఉంటాది అంటూ స్కూల్ బస్ నడిపే డ్రైవర్‌కు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చాడు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్‌కు బుద్ధొచ్చేలా ట్రాఫిక్ పోలీస్ భలే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..
పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు.
Telangana: హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.
‘‘నాన్నా నువ్వు నాకు కావాలి. నువ్వు మందు తాగి బండి నడపనని నాకు ప్రామిస్ చెయ్’’ అని డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి అతని కుమారుడితోనే కౌన్సెలింగ్ ఇప్పించి వార్తల్లో నిలిచారు
కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు (డిసెంబర్ 28, 2024న) మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీ చేశారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Traffic Police: క్రిస్మస్ పండగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన 50 వాహనదారులకు చలాన్లు విధించారు.
రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.