Home » Tomato Price
మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఏడాది పొడవునా టమోటా పంట సాగుచేస్తుంటారు. ఏ సమయంలో చూసినా మండలంలో రెండువేల ఎకరాలకుపైగా టమోటా సాగులో ఉంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు.
స్థానిక కోయంబేడు మార్కెట్లో టమోటా కిలో రూ.60కి పెరిగింది. ఈ మార్కెట్‌కు రాష్ట్రంలో పలు జిల్లాలు, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి అవుతోంది. కొద్ది నెలల క్రితం టమోటా ధర హఠాత్తుగా కిలో రూ.100కు పెరిగింది.
ఎట్టకేలకు టమోటాకు గిట్టుబాటు ధర దక్కుతోంది. ఏడాదిగా ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. కూలి ఖర్చులు కూడా దక్కలేదు. కొంతమంది పంటను చేనులోనే వదిలేశారు. ఇంకొందరు తొలగించి, రోడ్డు పక్కనే పడేశారు.
టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.
Tomato Powder: వెజ్ లేదా నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చొంటే.. మరోసారి ఊహించనంత చౌకగా దొరుకుతుంది. తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు..
AP GOVT: టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.
కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
టమోటా(Tomato) రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు.
రెండు నెలల క్రితం కిలో రూ.50..60 పలికిన టమోటా(Tomato) ధర... అమాంతం పడిపోవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమోటాకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళలేక చెత్తకుప్పలో పడేసిన దృశ్యం బళ్ళారి ఏపీఎంసి మార్కెట్(Bellary APMC Market)లో గురువారం చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర 20 నుంచి 35 రూపాయల దాకా ఉంది.