Home » Toll Rates
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది.
జాతీయ రహదారులపై టోల్ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.