• Home » TMC

TMC

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.

Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..

Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.

I.N.D.I.A :  ప్రధాన మంత్రి పదవి రేసులో తొలి పేరు ఇదే!

I.N.D.I.A : ప్రధాన మంత్రి పదవి రేసులో తొలి పేరు ఇదే!

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.

Opposition INDIA : ప్రతిపక్షాల కూటమి పేరుపై నితీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం?

Opposition INDIA : ప్రతిపక్షాల కూటమి పేరుపై నితీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం?

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

BJP Vs JDU : మమత చెలిమితో నితీశ్ మారిపోయారు : బీజేపీ

BJP Vs JDU : మమత చెలిమితో నితీశ్ మారిపోయారు : బీజేపీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee)తో స్నేహం చేసినప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) చాలా మారిపోయారని బీజేపీ ఆరోపించింది.

School jobs scam : అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్

School jobs scam : అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ కి సుప్రీంకోర్టులో సోమవారం షాక్ తగిలింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ఆపడానికి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన చేసిన అపీలును తోసిపుచ్చింది.

Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులు వీరే

Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులు వీరే

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రానున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. జూలై 24న జరిగే ఈ ఎన్నికల్లో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లామ్, ప్రకాశ్ చిక్ బరైక్, సాకేత్ గోఖలే పోటీ చేస్తారని ఓ ట్వీట్‌లో తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి