Home » Tirupati
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్త ప్రిన్సిపాల్స్, మూడు బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లు నియమించారు. సీఎం చంద్రబాబు ఆమోదంతో నియామక ప్రక్రియ పూర్తి అయింది.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండు కొత్త అరెస్టులు. మొత్తం అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది, వారిని విచారణ కోసం సిట్ కస్టడీలో తీసుకున్నారు.
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
Tirupati Police Drone: పగలు సైలెంట్ అయిన అల్లరిమూకలు రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్నారు. వీరి ఆటకట్టించేందుకు తిరుపతి పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో వారిని పట్టుకుంటున్నారు.
నా పేరు యూనివర్స్.. నేను రాజకీయపార్టీ పెడుతున్నా.. మద్దతివ్వండి.. అంటూ.. తిరుపతిలోని ప్రకాశం పార్కు కూడలి వద్ద ఓ వ్యక్తి ఫ్లెక్సీతో నిలబడ్డారు. అయితే.. అటుగా వెళ్లిన పలువురు ఈ వ్యక్తిని చూసి అతరి గురించి తెలుసుకోవడం కనిపించింది.
తిరుపతినగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ఆదివారం విజయవంతంగా ముగిసింది.
వరుసగా మూడు రోజుల సెలవులు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం.. ఈ క్రమంలో తిరుమలలో నెలకొన్న రద్దీ ఆదివారమూ కొనసాగింది.
టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
TTD Goshala Controversy: ఎస్వీ గోశాలలో జరిగింది అంతా ఒక కామెడీ షో అంటూ భూమన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదన్నారు. పది నెలల కాలంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని.. హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని, కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు.