Home » Thummala Nageswara Rao
రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా అంచనా వేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సంక్రాంతి నుంచి ‘రైతు భరోసా’ పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలో శనివారం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు.
రైతు భరోసాపై బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
వ్యవసాయం, సంక్షేమ రంగాలకు త్వరలో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకాన్ని వచ్చే జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటలు సాగు చేసేవారికే రైతు భరోసా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు.
రైతు భరోసాపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోన్‌సను అందిస్తున్న విషయం తెలిసిందే.
చేనేత రంగానికి తమ ప్రభుత్వం రూ.490 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని, గతంలో మాదిరిగా రైతులకు అన్ని రకాల పనిముట్లు రాయితీపై అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక దోపిడీ కారణంగా సంక్షేమ పథకాలు అమలుకు కాస్త ఆలస్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవటం లేదని అన్నారు. తప్పని సరిగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతలకు యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని స్పష్టం చేశారు. రైతన్నలకు చేయూత నిచ్చి పంటల దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.