Home » Thummala Nageswara Rao
గత ప్రభుత్వంలో పేదల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు చేశారు. సన్న బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ‘జీపీఎస్ రెనోవేబుల్ ఆర్య’ సంస్థ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని మాట్లాడుతున్న కొందరు.. ప్రజల సొమ్ముతో కేంద్రప్రభుత్వం నడుస్తున్నందున కేంద్ర పథకాల్లో సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు పెడతారా? అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశ్నించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ‘‘గ్రామగ్రామానికి జయశంకర్ వర్సిటీ నాణ్యమైన విత్తనం’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా 12 వేల గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో గుండెపోటుకు గురైన ఓ కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్యే డాక్టరు తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని, కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Thummala Nageswara Rao: తెలంగాణ రైతాంగం తలరాత ఆయిల్ పామ్ సాగుతో మారబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే పదేళ్లలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో గ్రీన్ తెలంగాణగా మారనుందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.