Home » Thanneeru Harish Rao
KCR: రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
Uttam Kumar Reddy:బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో మోసం, దగా జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డి పాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకెళ్లారని.. ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
HARISH RAO: పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు.. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్‌లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
BRS: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేూయడంతో బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు.
Harish Rao: బీఆర్ఎస్ నేతల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
Harish Rao: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
HARISH RAO: నవంబర్ వరకు మెస్ ఛార్జీలను వెంటనే రేవంత్ ప్రభుత్వం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారు..1 తేదీన జీతాలు రావడం లేదు..10 వ తేదీన వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.
పేదలను, రైతులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్‌రావు విమర్శించారు.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.