Home » TGSRTC
ఆర్టీసీ బస్ డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించకుండా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఆర్టీసీలోని కొందరు అధికారుల తీరు ప్రయాణికులపై అదనపు భారం మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు ఇష్టానుసారంగా ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి తిప్పుతూ ప్రయాణికుల నుంచి ఆమేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్‌కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్‌జీఐఏ బోర్డింగ్ పాయింట్‌కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి విడతలో భాగంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
పుష్పక్ బస్సుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న చార్జీల్లో రూ.50 తగ్గిస్తున్నట్లు శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీబస్ స్టేషన్‌కు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.450 చార్జీలు వసూలు చేస్తుండగా దాన్ని రూ.400గా నిర్ణయించారు.
పుష్పక్ బస్సుల్లో రాత్రిపూట రూ. 100, పగటి పూట రూ. 50 చార్జీలు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తోంది ఆర్టీసీ. నగరంలో పలు ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్న పుష్పక్ బస్సుల్లో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.