Home » TGSRTC
భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎ్‌సలను నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకం తెలంగాణలో సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకం కారణంగా.. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్‌రింగ్ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
సద్దుల బతుకమ్మ ఈనెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.
గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో లాభాల బాటలో పయనిస్తున్న టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టిసారిస్తోంది.
ఐటీ కారిడార్‌లో ఎలక్ర్టిక్, మెట్రో డీలక్స్ బస్సులను ప్రముఖ ఐటీ సంస్థలకు అద్దెకిచ్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తే ఐటీకారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.