Home » TG Govt
భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించి మోసానికి పాల్పడ్డాడు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. అధికారులకి అనుమానం వచ్చి కూపీలాగితే ఆయన డొంక కదిలింది.
నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు ఎయిర్ లైవ్ పబ్ పార్టనర్ విశ్వత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో జీవో నెంబర్- 9 మీద తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆర్డర్ కాపీ ఉంది. జీవో నెంబర్- 9కి చట్టబద్ధత లేదని హై కోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.