• Home » Tenth Exams

Tenth Exams

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్‌ విద్యార్థులకు సూచించారు.

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

TS SSC Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ‘పది’ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..

TS SSC Result 2024: రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

TS SSC Result 2024: రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి

పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.

AP 10th Results Update: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యేది అప్పుడే

AP 10th Results Update: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యేది అప్పుడే

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

TG News:  చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

TG News: చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..

నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.

Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.

Exams: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్

Exams: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్

Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్‌ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి