Home » Telugu Desam Party
టీడీపీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తొలి రోజు మహానాడు జరిగిన తీరుపై సమీక్షించారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సీఎం చంద్రబాబుకి ఆపదలో ఉన్న కార్యకర్తలకు సాయం చేసి ఆదుకోవడమే తెలుసునని ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. కార్యకర్త, నాయకుడికి ఏ కష్టం వచ్చినా భరోసాగా చంద్రబాబు, లోకేష్ నిలిచారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చామని ఏపీ మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు విజనరీ ఉన్ననేత.. ఆయన పార్టీని ముందుకు నడిపారని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కొనియాడారు. చంద్రబాబుతో పాటు తాము అందరం పార్టీని వైసీపీ నుంచి కాపాడామని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.
Minister Narayana: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదని చెప్పారు.
Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.
Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.
Paritala Sunitha: ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని.. ఒక్కొక్కరిపై గత జగన్ ప్రభుత్వంలో 20, 30 కేసులు పెట్టారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు ఇంకా అదే ముసుగు వేసుకున్నారని.. టీడీపీ కార్యకర్తలపైనే కేసు పెడుతున్నారని మండిపడ్డారు.
Palnadu District Case: మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రెండు జంట హత్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. టీడీపీ వర్గీయులను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.