• Home » Telangana Govt

Telangana Govt

Vote for Note: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Vote for Note: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Telangana: ఎక్సైజ్‌ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్‌

Telangana: ఎక్సైజ్‌ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్‌

ఎక్సైజ్‌ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్‌ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ను..

Bhadradri: రాములోరి కళ్యాణానికి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈసారి కష్టమేగా!

Bhadradri: రాములోరి కళ్యాణానికి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈసారి కష్టమేగా!

Telangana: శ్రీ సీతారాముల కళ్యాణం.. కమనీయం. ప్రతీఏటా భద్రాచంలో శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు. ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూసేందుకు వీలుకాని వారు.. లైవ్ టెలికాస్ట్‌ ద్వారా కోట్లాది మంది భక్తులు టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. శ్రీసీతారాముల కళ్యాణాన్ని చూస్తూ భక్తులు పరవశించిపోతుంటారు.

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

Telangana: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ.

TS News: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై కమిషనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

TS News: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై కమిషనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana: రైతుల బాగుకోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రైతులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గతనెల 25వ తేది నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించామని.. 7149 కేంద్రాల్లో కలిపి 1.87 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిజామాబాద్‌లో 1లక్ష ఎల్‌ఎంటీ, కామారెడ్డిలో 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కావాల్సిన యంత్రాలు సిద్ధం చేశామన్నారు.

TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు.

Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!

Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!

Telangana: తెలంగాణలో త్వరలో బీర్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అందుకు గ్రేటర్‌లో తాగునీటి కొరతే కారణమా? డిమాండ్‌కు తగ్గట్లు బీర్లను బ్రూవరీలు సప్లై చేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా మందుబాబులకు చేదు వార్తనే చెప్పాలి..

TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం

TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం

Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

TG Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

TG Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌‌లు రాగా.. ఒకరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ఐఏఎస్ నియమితులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి