Home » Telangana Budget
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాబోయే పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.17.26 లక్షల కోట్లు (200 బిలియన్ డాలర్లు) అని..పదేళ్లలో దీన్ని రూ.86.30 లక్షల కోట్లకు చేర్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్‌లో హోంశాఖకు రూ.10,188కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు రూ.9,337కోట్లు కాగా ప్రగతి పద్దు కింద రూ.851కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
వెనకబడిన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా విద్యా, ఉద్యోగరంగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించి ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు కేటాయించారు.
నీటిపారుదల శాఖకు రూ.23,354 కోట్లు కేటాయించారు. ఇందులో.. కృష్ణా, గోదావరి పరీవాహకంలో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.8,774 కోట్లను ప్రతిపాదించారు.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ధరల వద్ద 10.1 శాతం మేర వృద్ధి నమోదైంది.
రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోంది. పాత అప్పులు, కొత్త బడ్జెట్‌లో తీసుకోబోయే అప్పులు కలిపి తడిసిమోపెడు కానున్నాయి. 2025-26లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే బడ్జెట్ అని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విప్లవ నాయకుడని కొనియాడారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ, విదేశీ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల శాఖకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు భారీగా పెంచింది. గతేడాది రూ. 2,732 కోట్లు కేటాయించగా..
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,100 కోట్లు కేటాయించారు.