Home » Tehran
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు మంగళవారంతో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉద్ధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్‌లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు.
యూనివర్శిటీలో నిరసన తెలిపిన యువతి ఆచూకీపై ఆమ్నేష్టి ఇంటర్నేషనల్ స్పందించింది. ఇరాన్ అధికారులు ఆ యువతని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించకుండా అధికారులు నిరోధించాలని, తన కుటుంబ సభ్యులను, లాయర్‌ను కలుసుకునేందుకు ఆమెకు వీలు కల్పించాలని కోరింది.
ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది.
తూర్పు ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకైంది. దీంతో భారీ పేలుడు సంభవించి 30 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ఇచ్చింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగుదేశం అజర్‌బైజాన్, ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దులాహియన్, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరారు.