Home » Tech news
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హ్యాకర్లు బ్యాంకుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనూ వదలట్లేదు. తాజాగా కెనరా బ్యాంక్ అధికారిక సోషల్ మీడియా(Canara Bank X account hacked) హ్యాండిల్ X అకౌంట్ హ్యాక్‌కి గురైంది. హ్యాకర్లు అధికారిక ఎక్స్ హ్యాండిల్ పేరును 'ether.fi'గా మార్చారు.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్‌లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది.
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ యాప్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి మస్క్ నిర్ణయం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మస్క్ వెనక్కి తగ్గారు. అయితే ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.