Home » Teacher
వివాదాస్పదమైన జీవో 117కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. తొమ్మిది రకాల పాఠశాలల రూపకల్పనతో టీచర్ల బదిలీలకు సిద్ధమవుతున్నారు
డీఎస్సీ అర్హతకు సంబంధించి 50 శాతం మార్కుల నిబంధన పెడుతూ, బీఈడీ జనరల్ అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 కంటే ముందు బీఈడీ చేయించిన వారికి ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు ప్రకారం మార్కుల మినహాయింపు ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఈ సడలింపును అనుసరించడం లేదు.
కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు నూతన లక్ష్యాలతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి విద్యలో ప్రగతి సాధించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కోరారు.
హైకోర్టు పదవీ విరమణ ప్రయోజనాలు అందని కారణంగా వృద్ధి చెందిన మనోవేదనతో మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడు కూరపాటి పాండురంగయ్య మృతిపై సుమోటో విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ, పాఠశాల విద్యాశాఖ, అకౌంటెంట్ జనరల్‌కు నోటీసులు జారీ చేసి జూన్‌లో తదుపరి విచారణను వాయిదా వేసింది
డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఐచ్ఛికంగా మార్చింది.
డీఎస్సీ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్‌లోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్‌సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.
Teacher Offers Alcohol To Students: ఓ ఉపాధ్యాయుడు తన స్థాయిని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి తగిన శాస్తి జరిగింది.
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎసీజీటీల కేటాయింపు ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. 6 నుంచి 8 తరగతులకు ఎసీజీటీలతో బోధించడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు