Home » Supriya
రానున్న లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే తేల్చిచెప్పారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదని..
విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల సమావేశం ముంబైలో విజయవంతం కావడంతో తదుపరి సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదక కానుంది. ఈ విషయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.