• Home » Summer

Summer

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

Heat Stroke: భయపెడుతున్న సూర్యుడు.. వడదెబ్బతో 12 మంది మృతి

దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్‌లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్‌లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ..

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ..

రెండు మూడు రోజులకు ఒకసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని తెలిపింది. అవును, వర్ష సూచన ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ..

GAMES : పిల్లలకు ఆటల్లేవ్‌!

GAMES : పిల్లలకు ఆటల్లేవ్‌!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్‌ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్‌...

GENERAL HOSPITAL : ఓపీలో నరకం

GENERAL HOSPITAL : ఓపీలో నరకం

సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్‌ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి

Rain: మండుటెండలో కుండపోత...

Rain: మండుటెండలో కుండపోత...

మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad Rains: మండే ఎండల నుంచి ఉపశమనం.. భాగ్యనగరానికి వర్ష సూచన

Hyderabad Rains: మండే ఎండల నుంచి ఉపశమనం.. భాగ్యనగరానికి వర్ష సూచన

మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

PLANT : నాటితే సరిపోతుందా..?

PLANT : నాటితే సరిపోతుందా..?

రుద్రంపేట సర్కిల్‌ నుంచి కళ్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్‌ వరకూ జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..

GUMMANUR JAYARAM  : నా విజయం తథ్యం..!

GUMMANUR JAYARAM : నా విజయం తథ్యం..!

గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.

Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్‌ న్యూస్‌. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్‌ అలెర్ట్‌’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి