Home » Student
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్మెంట్లు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే ఎఫ్-1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది.
మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లోని మహీంద్ర విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్‌ను సైబరాబాద్ ఈగల్ పోలీసు బృందాలు బట్టబయలు చేశాయి.
జమాత్ పై నిషేధం తర్వాత దాదాపు 300 పాఠశాలలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయని మంత్రి సకినా ఇటూ తెలిపారు. నిఘా సంస్థల దర్యాప్తు ఆధారంగా, 50 పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. అయితే, 215 పాఠశాలల నిర్వహణ కమిటీలపై ప్రతికూల నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు.