Home » Student
Indian Students in US: 2023-24 మధ్య స్టూడెంట్ వీసా పొందిన విదేశీ విద్యార్థుల జాబితాను అమెరికా విడుదల చేసింది. ఇందులో చైనా రెండవ స్థానంలో ఉండగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది.
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రదర్శనపై సీఎం బహుమతులు అందజేయనున్నారు.
అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. సోషల్ మీడియా తనిఖీలపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు, తరగతులకు హాజరు కాకపోతే వీసా రద్దు జరిగే హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో మరో 20 సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 78 గురుకులాలు మంజూరు కాగా, ఈ ప్రాజెక్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో జరుగుతుంది.
ఆదివారం విడుదలైన తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థినులు సత్తా చాటారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది.
ఎస్సీ గురుకులాల్లో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
కోచింగ్ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి అమెరికా కోర్టు నుంచి ఉపశమనం లభించింది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆదేశంపై అమెరికా కోర్టు స్టే విధించింది.