Home » Stock Market
ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. మళ్లీ స్టాక్ మార్కెట్లో ఐపీఓల వీక్ (Upcoming IPOs) రానే వచ్చింది. అయితే ఈసారి నాలుగు IPOలు రాబోతున్నాయి. వీటిలో 3 SME IPOలు ఉండగా, ఒకటి మెయిన్‌బోర్డ్ నుంచి వస్తుంది.
ఓ కంపెనీ షేర్లు రూ.8,300 నుంచి ఈరోజు ఒక్కరోజే ఏకంగా 33 శాతం పడిపోయి రూ. 6,007.75కి చేరుకున్నాయి. ఇలాంటి భారీ తగ్గుదల ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ఎందుకు ఈ షేర్ ఒక్కసారిగా పడిపోయింది, ఏంటనే విషయాలను తెలుసుకుందాం.
ఆర్బీఐ తాజా నిర్ణయాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ రెచ్చిపోయాయి. ఇవాళ ఒక్క రోజులో 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద పెరిగింది. ఇక, ఆర్బీఐ తాజా నిర్ణయాలు 9.5లక్షల కోట్ల డబ్బు వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.
బుధవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా లాభాల్లోకి వచ్చాయి.
గత మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసి వచ్చింది.
గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మంగళవారం దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.
స్టాక్ మార్కెట్లో ప్రతి రోజు ఏ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో ముందే ఊహించడం కష్టమని చెప్పవచ్చు. అయితే మంచి ప్రదర్శన చేసే కంపెనీలను ఎంచుకుంటే మాత్రం వాటి నుంచి దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలను పొందవచ్చు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీడీఎస్ఎల్ స్టాక్ నిరూపించింది.
దేశ జీడీపీ స్థిరంగా కొనసాగుతుండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం ఫలితాల నేపథ్యంలో సోమవారం దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. ఉదయం భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల (Upcoming IPOs June 2025) వారం వచ్చేసింది. ఈసారి కొత్త ఐపీఓలు తక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే వారంలో (జూన్ 2 నుంచి) కొత్త కంపెనీలు ఎక్కువగా లిస్ట్ కానున్నాయి. ఆయా కంపెనీలు ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శాతం నమోదు కాగా, నాల్గో త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంగా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రకటించారు.